ఏపీ విద్యార్థులకు అలర్ట్..‘టెన్త్’ పరీక్షలు తేదీ ఖరారు !

-

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల తేదీలు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ టెన్త్ క్లాస్ పరీక్ష తేదీలను.. ఇప్పటికి నిర్ణయించారట. దీని ప్రకారం వచ్చే సంవత్సరం మార్చి 15వ తేదీ నుంచి ఏపీ పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

AP Class 10 Exams from 15th March

ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారట. అలాగే 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సంక్రాంతి సెలవుల్లో కూడా.. ప్రత్యేక క్లాసులు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు అధికారులు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు… క్లాసులు నిర్వహించే ఛాన్స్ ఉందట. అంతేకాదు ఆదివారాల్లో కూడా క్లాసులో నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భారీ ప్లాన్ వేస్తోందట. అలాగే సంక్రాంతి సెలవులను మూడు రోజులకు కుదించారట. దాదాపు రెండు వారాలపాటు గతంలో సెలవులు ఇచ్చేవారు. అందులో ఈసారి మూడు రోజులపాటు కుదించాలని నిర్ణయం తీసుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news