కేంద్ర మంత్రి కుమారస్వామితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ..!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జే.పీ.నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు.

తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి తో భేటీ అయ్యారు. ముందుగా కుమారస్వామి నివాసానికి వెళ్లిన చంద్రబాబును.. ఆయన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్  ను సెయిల్ లో విలీనం చేయడంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ ఉక్కు పరిశ్రమను గట్టెక్కించడానికి  ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version