ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో ఓ మైనర్ బాలికకి మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది. ఇందిరానగర్ మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబు.. మైనర్ బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం చేశాడు. ఈ వ్యవహారంలో ఓ మహిళ కూడా అతనికి సహాయం చేసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి బలవంతంగా ఆటో ఎక్కించుకొని డంపింగ్ యార్డ్ దగ్గరకు తీసుకెళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజాగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సంచలన కామెంట్స్ చేశారు.టీడీపీ నాయకులు ఎలా బరితెగించి ప్రవర్తిస్తున్నారో పిఠాపురం ఘటన ఉదాహరణ అన్నారు. పిఠాపురం ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓ సిఐ తల్లి అపహరణకు గురైంది. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏమవుతున్నాయి అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఎందుకు శాంతిభద్రతలను అదుపు చేయడం లేదు అని ప్రశ్నించారు. పోలీసులు ఒత్తిళ్ళ మధ్య ఉన్నారా? రోజుకు ఎక్కడో చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి అని ప్రశ్నించారు.