ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కు బిగ్ రిలీఫ్ దక్కింది. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం. ఈ కేసులో పిటీషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కు బిగ్ రిలీఫ్ దక్కింది. కాగా.. ఇదే కేసులో గతంలో.. సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.