AP CM Jagan : ఏపీ సీఎం జగన్ ఇవాళ హైదరాబాదుకు రానున్నారు. ఇటీవల తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి పరామర్శించనున్నారు. కొన్ని రోజులక్రితం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ జారిపడగా, తుంటి ఎముక విరిగింది. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్న అనంతరం ఆయన తిరిగి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో ఉంటున్నారు. ఇందులో భాగంగానే… ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాదుకు బయలుదేరనున్నారు సీఎం జగన్. 11.15 కు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు సీఎం జగన్. అనంతరం ఇటీవల తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి పరామర్శించనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్.