రూ. 13లక్షల కోట్లకు చేరిన ఏపీ అప్పులు !

-

 

ఏపీ అప్పులపై బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ. 13లక్షల కోట్లకు చేరినట్లు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు.

వీటిలో బడ్జెట్ రుణాలు రూ. 5.50 లక్షల కోట్లు, బడ్జెటేతర రుణాలు రూ. 7.50లక్షల కోట్లని చెప్పారు. వీటన్నింటికీ కలిపి రోజుకు రూ. 250కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో ఏపీ పరిస్థితి ప్రమాదంలో పడిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version