జగన్ సర్కార్ పై మాకు నమ్మకమే లేదు.. ఇది క్రిమినల్ చర్య – ఏపీ ఉద్యోగులు

-

ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి డబ్బులు విత్ డ్రా కావడంపై పీఏజీకి ఫిర్యాదు చేశాయి ఉద్యోగ సంఘాలు. జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి సొమ్ము విత్ డ్రా అయినప్పుడు తమకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పు పడుతోన్నాయి ఉద్యోగ సంఘాలు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ….ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే డబ్బులు విత్ డ్రా చేసింది.సాంకేతిక సమస్య అంటూ ఆర్థిక శాఖ అధికారులు చెప్పింది శుద్ధ అబద్దమన్నారు.

డీఏ బకాయిల బిల్లు పాస్ కాకున్నా.. పొరపాటున ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యాయని ఆర్థిక శాఖ అధికారులు నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు….బిల్లులు పాస్ కాకుండా డబ్బులు జమయ్యే లోపభూయిష్టమైన విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందా..?అని ప్రశ్నించారు.పీఏజీ ఇచ్చిన వివరణతో ప్రభుత్వం ఉద్గేశ్యపూర్వకంగానే డబ్బులు డ్రా చేసిందని స్పష్టమైంది…గతంలో ఇదే తరహాలో జరిగిన వ్యవహరం గురించి పీఏజీ ఏడాది కాలం నుంచి ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతోందని ఫైర్ అయ్యారు.

మా ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం నిబంధనలకు విరుద్దమని పీఏజీ కూడా అంగీకరించింది…ప్రభుత్వం ఈ తరహాలో ఆర్ధిక లావాదేవీలు జరుపుతోంది కాబట్టి ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం పోయిందన్నారు. తమ డబ్బు ఏమైపోతుందనే భయంతోనే జీపీఎఫ్ ఖాతాల నుంచి తమ డబ్బు ఇచ్చేయాల్సిందిగా ఉద్యోగులు అర్జీలు పెట్టుకుంటున్నారు….మా ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేసిన ప్రభుత్వం.. తన తప్పిదాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు తెలియకుండా వారి ఖాతాల నుంచి డబ్బులను విత్ డ్రా చేయడం క్రిమినల్ చర్య అని…సీఎఫ్ఏంఎస్ నుంచి మా ఖాతాలను ఆపరేట్ చేసే అథార్టీని ఎవరు ఏ చట్టం కింద ఇచ్చారో తెలియచేయాలన్నారు. సీఎఫ్ఎంఎస్ సంస్థకు ఎలాంటి చట్ట బద్దతా లేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version