ఏపీ గ్రూపు-1 ఫైనల్ ఫలితాలు విడుదల

-

ఏపీ గ్రూపు-1 పరీక్ష తుది ఫలితాలను తాజాగా ఏపీపీఎస్సీ ప్రకటించింది. విజయవాడలో ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ ఫలితాలు విడుదల చేశారు. గ్రూపు 1లో ఖాళీల 110 పోస్టులకు తుది ఫలితాలను ప్రకటించారు. నోటిఫికేషన్ నుంచి ఫలితాలు వెల్లడయ్యే వరకు పూర్తి పారదర్శకత పాటించిది ఏపీపీఎస్సీ. ఫలితాలను విడుదల చేసిన తరువాత ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడారు. రికార్డు సమయంలో గ్రూపు 1 ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా పూర్తి చేసాం. తొలిసారిగా సీసీ కెమెరాలను వినియోగించాం. 111 పోస్టులకు 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం. స్పోర్ట్స్ కోటా మరో పోస్టు ఎంపిక జరుగుతుంది. 1:2 కోటాలో ఇంటర్వ్యూకి అభ్యర్థులను ఎంపిక చేశాం. 11 నెలల సమయంలో గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్టు తెలిపారు.

ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరైన వారిలో ఉన్నారు. ఎంపికైన వారిలో పది స్థానాల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులున్నారు. టాప్ 5లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలే అని వెల్లడించారు గౌతమ్ సవాంగ్. ఫస్ట్ ర్యాంకర్ -భాను శ్రీ లక్ష్మీ అన్న పూర్ణ ప్రత్యూష (బీఏ ఎకానామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీ), సెకండ్ ర్యాంకు భూమిరెడ్డి భవాని (అనంతపురం), 3వ ర్యాంకు కంబాట కుంట లక్ష్మీ ప్రసన్న (అనంతపురం) 4వ ర్యాంకు కె.ప్రవీన్ కుమార్ రెడ్డి (జేఎన్టీయూ అనంతపురం), 5వ ర్యాంకు భాను ప్రకాశ్ రెడ్డి ( కృష్ణా యూనివర్సిటి) కి చెందిన వారు టాప్ ర్యాంకులు సాధించారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ని అస్సలు నమ్మకూడదని సూచించారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version