ఎన్డీఏకు 300 సీట్లు.. వెల్లడించిన టైమ్స్ నౌ ఈటీజీ సర్వే

-

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినట్టయితే ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ ఒపినీయన్  పోల్ లో వెల్లడైంది. ఎన్డీఏ కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ తో పాటు దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమికి అధికారం రాదని ఈ సర్వే వెల్లడించింది. ఇక ఎన్డీఏతో పోల్చితే ఇండియా కూటమి చాలా వెనుకబడి ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

ఉత్తర భారతదేశంలో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తెలిపింది టౌమ్స్ నౌ ఈటీజీ. సౌత్ కి వచ్చే సరికి ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ హవా కొనసాగుతుందని పేర్కొంది. ఈ ఏడాది చివరిలో జరుగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రధానిగా వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంటాడని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వెల్లడించింది. ఎన్డీఏ కూటమికి 296 నుంచి 326 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. ఇందులో 288 నుంచి 314 స్థానాలు బీజేపీ గెలుస్తుందని వెల్లడించింది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మోడీ మ్యాజిక్ పని చేస్తుందని.. ఆ ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి ఆధిపత్యం కొనసాగుతుందని సర్వే అంచనా వేసింది. ఎన్డీఏ విజయశాతం 80 శాతంగా ఉంటుందని వెల్లడించింది టౌమ్స్ నౌ ఈటీజీ.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version