గుంటూరు మేయర్ కు హైకోర్ట్ చురకలు.. ఇదేం భాష, ఇదేం పద్ధతి..?

-

గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడికి హైకోర్ట్ చురకలు అంటించింది. ఇదేం పద్ధతి, ఇదేం భాష అని ప్రశ్నించిన హైకోర్ట్.. అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు, తల్లుల పై దాడి చేస్తారా.. నగర మొదటి పౌరుడు మాట్లాడేది ఇలాగేనా అని సీరియస్ అయ్యింది. సేవచేసి ప్రజలకు దగ్గరవ్వాలే తప్ప అసభ్యకర భాషతో కాదు. మురికి భాషను ఉపయోగించి ఎన్నికలను గెలవాలని అనుకోకూడదు. అసభ్యకర భాష వాడినవారు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే అని తెలిపింది.

ఇక రాజకీయపార్టీలు అవతలివారి విధానాలు, పాలసీలను విమర్శించాలి. ప్రజాస్వామ్యంలో మేయర్ వాడిన పదజాలాన్ని అంగీకరించలేం. నగరమేయర్ ఇతర పౌరులకు ఆదర్శంగా ఉండాలి ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని మండిపడిన హైకోర్టు.. నగర మొదట పౌరుడిగా నిందితుడిని బాధ్యతగా మెలగమని చెప్పండి అంటూ మనోహర్ నాయుడు తరపు న్యాయవాదికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవే. పిటిషనర్ కు సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు ఇవ్వండి. కేసు పై పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి అని పోలీసులకు ఆదేశం ఇచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version