ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ఠ్. రేపు ఏపీ ఐసెట్ పరీక్ష జరుగనుంది. ఏపీ ఐసెట్ పరీక్షకు 49, 162 మంది దరఖాస్తులు చేసుకున్నారని అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుందన్నారు.
ఈ మేరకు 11 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. నిమిషం లేట్ అయిన అనుమతి ఉండదని తెలిపారు. కాగా, పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ఎల్లుండి నుంచి ప్రారంభిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 29 నుంచి జూన్ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన, జూన్ 1 నుంచి 6 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. 7న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 9న సీట్ల కేటాయింపు 15 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజులు జూన్ 1 లోగా చెల్లించాలి.