రికార్డు స్థాయి ధర పలికిన కేకేఆర్ మాజీ కెప్టెన్..!

-

సౌదిలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. ఈ ఆక్షన్ లో మొత్తం 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత స్టార్ బౌలర్ అర్ష్ దీప్సింగ్ ను పంజాబ్ తిరిగి రూ.18 కోట్లకు ఆర్టీఎం పద్దతిలో కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ, రాజస్థాన్ రాయల్స్, SRH పోటీ పడ్డాయి. గతంలో ఇతను పంజాబ్ కింగ్స్ తరుపునే ఆడాడు. ప్రారంభంలో వికెట్లు పడగొట్టడం ఇతని స్పెషాలిటీ. 

ఇక ఇదిలా ఉంటే. కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు సొంతం చేసింది. మరోవైపు ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత భారీ ధర పలికి ప్లేయర్ గా శ్రేయస్ రికార్డు కొల్లగొట్టాడు. బేస్ ప్రైజ్ రూ.2కోట్లు ఉండగా.. రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇతని కోసం ఢిల్లీ, పంజాబ్ తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అయ్యర్ 2024 సీజన్ లో కేకేఆర్ ను విజేతగా నిలిపారు. కానీ ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ గత ఏడాది రూ.24.75 కోట్లు పలికారు. ఈ ఏడాది ఆ రికార్డు ఇప్పటివరకు బ్రేక్ అయిందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version