ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల కుటుంబాలకు బిగ్ అలర్ట్. సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది జూన్ మాసం నుంచి ఇప్పటివరకు 39 మంది రైతులు అలాగే కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.
వీరి కుటుంబాలకు త్వరలో ఏడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని కూడా అచ్చెన్నాయుడు వివరించడం జరిగింది. 2024 జూన్ మాసానికి ముందు 103 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. వీరిలో 49 కుటుంబాలకు 3.43 కోట్లు… ఇప్పటికే విడుదల చేసినట్లు స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు . మరో 32 కేసులకు 2.24 కోట్లు త్వరలో రిలీజ్ చేయబోతున్నామని కూడా హామీ ఇచ్చారు.