DSC అభ్యర్దులకు ఏపీ సర్కార్ మరో శుభవార్త

-

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 DSC అభ్యర్దులకు శుభ వార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. వారికి న్యాయం చేసే ఫైల్ పై సంతకం చేశారు సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి. వారికి ఉద్యోగం ఇచ్చేందుకు విధివిధానాలను సిద్దం చేస్తుంది ఏపీ ప్రభుత్వం.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న 98 DSC ఫైల్ పై సీఎం సంతకం చేశారని.. 20 ఏళ్ల నుంచి ఈ సమస్య పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. ఏ ప్రభుత్వమూ వారికి న్యాయం చేయలేదని.. అభ్యర్థుల కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం ఒక్క వైఎస్ జగన్ కే సాధ్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎమ్మెల్సీ కమిటీ వేసినా 98, 2008 DSC వారికి న్యాయం చేయలేదని మండిపడ్డారు. 2008 డీఎస్సీ వారికి కూడా సీఎం జగనే న్యాయం చేశారన్నారు. 4565 మందికి ఇప్పుడు న్యాయం జరగనుందని పేర్కొన్నారు. త్వరలోనే గైడ్ లైన్స్ వస్తాయి…విధివిధానాలు రూపొందిస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version