విద్యుత్ చార్జీల పెంపుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. విద్యుత్ చార్జీల పెంపు పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి…గత ప్రభుత్వ తప్పిదాల వల్లే విద్యుత్ చార్జీల పెంపు అన్నారు.. యూనిట్ 5 నుంచి 7 రూపాయలకు కొనడం వల్లే ఈ భారం పడుతోందన్నారు. అనుభవజ్ఞుడైన చంద్ర బాబుకు ప్రజలకు ఏం చేయాలో తెలుసు..ప్రజలపై కూటమి ప్రభుత్వం ఏ భారం వేయదని వివరించారు.
కడప ఎయిర్ పార్టీలో కడప – హైదరాబాద్ ఇండిగో కనెక్టింగ్ విమాన సర్వీసును రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, చైతన్య రెడ్డి..లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదిగా కడప హైదారాబాద్ విమాన సర్వీసులు లేవు..ఎన్నో సార్లు లేఖలు రాసిన ప్రయోజనం లేదని తెలిపారు.
టీడిపి అధికారంలోకి వచ్చాక హైదారాబాద్ సర్వీసులు పునరుద్ధరించారని వివరించారు. హైదరాబాద్ కానెక్ట్ విటీ ద్వారా దేశంలో.అన్ని చోట్లకు వెళ్లే సదుపాయం కలుగుతోందన్నారు. కేంద్ర విమాన శాఖ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు..కడప నుంచి దూర ప్రాంతాలకు కూడా త్వరలో కానెక్టివిటీ పెంచుతామని వివరించారు. అలానే రైల్వే శాఖలో అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని… కూటమి ప్రభుత్వం వచ్చి 120 రోజులు దాటిందని గుర్తు చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.