నాచారం ఎస్టీపీని పరిశీలించిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాచారంలో నిర్మించిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ (ఎస్టీపీ)ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరిశీలించారు. అనంతరం ప్లాంట్ పనితీరు ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీటింగులో కేటీఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామిక వ్యర్థాలు, జనావాసాల నుంచి వస్తున్న మురుగునీటి శుద్ధీకరణలో ఎస్టీపీల పాత్ర ఎంతో కీలకం అని పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలో సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు.నగరవాసుల బాగుకోసం దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీ ప్లాంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.‘ఇల్లు తాము కడితే రేవంత్ రెడ్డి సున్నాలు వేస్తున్నాడంటూ’ సెటైర్లు వేశారు. రుణమాఫీకి, రైతుబంధు, ఏ పథకం అమలు చేయాలన్నా పైసలు లేవని మంత్రులు చెబుతున్నారని, మరి మూసీ పునరుజ్జీవనానికి మాత్రం ప్రభుత్వం వద్ద పైసలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version