మా బకాయిలు ఇచ్చేవరకు ఇక ఆరోగ్యశ్రీ సేవలు నడపలేం ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తాజాగా ప్రభుత్వానికి నోటీసులు విడుదల చేసాయి. ఇకపై తగ్గేది లేదు అంటూ తమ డిమాండ్స్ ను ప్రభుత్వం ముందు ఉంచాయి. దీంతో ప్రజలకు కష్టాలు తప్పవు అనే చెప్పాలి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇచ్చిన నోటీసులో.. మాకు రావాల్సిన బకాయిలు 1750 కోట్లకు చేరిపోయాయి. కాబట్టి ఇకపై మేము ఆరోగ్యశ్రీ సేవలు నడపలేం.
మాపై దాడులు పెరిగిపోయాయి… దొంగలుగా చూపిస్తున్నారు. ఇన్ని రోజులుగా ప్రభుత్వం బకాయిలు పెట్టినా మేం పని చేస్తున్నాం. కానీ ఇక పై తగ్గేది లేదు. మా బకాయిలు చెల్లించే వరకూ మేం ఆరోగ్యశ్రీ సేవలందించం. ప్రభుత్వం ఇప్పటి వరకూ ఉన్న అన్ని బకాయిలు చెల్లించాలి. అలాగే ఇక నుండి ఎన్టీఆర్ వైద్యసేవా సేవల బిల్లులు క్రమపద్ధతిలో విడుదల చేసే ఏర్పాటును కూడా ప్రభుత్వం చేయాలి అని ఆంధ్ర ప్రదేశ్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రభుత్వంను కోరాయి.