మెగా బ్రదర్ నాగబాబు కు కీలక పదవి ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు కు అప్పట్లో రాజ్యసభ అన్నారు… ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి అన్నారు… మంత్రి పదవి కూడా వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ గా నాగబాబును నియామకం చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రయత్నాలు చేస్తుందట.
అది కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభీష్టం మేరకు… చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఎల్లో మీడియా లో కూడా ఇలాంటి కథనాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. ఏపీ కేబినేట్లోకి నాగబాబును తీసుకుంటారని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రమే.. ఇవ్వబోతున్నారట. పర్యావరణ శాఖకు సంబంధించిన కార్పొరేషన్ పదవి రాబోతున్నట్లు సమాచారం.