చీకట్లో రథాలను తగలబెట్టింది మీరు కాదా?: వెల్లంపల్లి

-

వినాయక చవితి పండుగ వస్తుంటే రాష్ట్ర ప్రజలందరు ఆనందంగా జరుపుకుంటారు.. కానీ సోము వీర్రాజు, చంద్రబాబు నీచంగా మాట్లాడటం చూస్తే బాధ వేస్తుందన్నారు మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రత్యేకమైన ఆంక్షలు ఏవీ లేవని రాష్ట్ర డీజీపీ, దేవాదాయ శాఖ ఉప ముఖ్యమంత్రి అందరూ చెప్పారని అన్నారు. గతంలో ఉన్న ఆంక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. గతంలో విద్యుత్, మున్సిపల్ వంటి నాలుగు శాఖల దగ్గర విడివిడిగా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేదని.. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనలు సరళీకరించటానికి సింగిల్ విండో విధానం పెట్టామని అన్నారు.

అయినా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను 2014లో బీజేపీ నుంచి పోటీ చేశానని.. అప్పుడు తన నియోజకవర్గంలోనే గుళ్ళను టీడీపీ ప్రభుత్వం కూలగొడితే నేను అడ్డుకున్న విషయం వాస్తవమా కాదా? అంటూ ప్రశ్నించారు. హిందూ దేవాలయాలను కూల్చిన ద్రోహులు చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే గత ఎన్నికల్లో దేవుడు ఈ ముగ్గురికి తగిన శిక్ష వేశాడని అన్నారు మాజీమంత్రి వెల్లంపల్లిి. చీకట్లో రధాలను తగులబెట్టింది మీరు కాదా? అంటూ మండిపడ్డారు.

చీకట్లో తప్పుడు పనులు చేసిన మీరు హిందూ దేవాలయాల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి, సోము వీర్రాజు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జనసేనకు లేదన్నారు. మరోసారి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే…సోము వీర్రాజుకు మర్యాద ఉండదని హెచ్చరించారు. దేవుడి విషయంలో రాజకీయాలు చేస్తే పుట్ట గతులు ఉండవన్నారు. సోము వీర్రాజు, బీజేపీలా మా ప్రభుత్వం మత రాజకీయాలు చేయదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version