కారణం మీరే అంటూ కరణ్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన కృతి సనన్..!!

-

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ఈయన కాఫీ విత్ కరణ్ అనే ప్రోగ్రాంకి హోస్టుగా వ్యవహరిస్తూ తన షోకి వచ్చే సెలబ్రిటీలను లవ్, డేటింగ్ అంటూ రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇప్పటికే జాన్వి కపూర్ ను మొదలుకొని సమంత, కరీనాకపూర్ , కియారా అద్వానీ ఇలా అందరినీ కూడా తన షోకి పిలిచి తన మాటలతో మానసికంగా వారిని ఇబ్బంది పెట్టాడని చెప్పవచ్చు. అంతేకాదు నిన్నటికి నిన్న లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య పాండే కాఫీ విత్ కరణ్ షో కి హాజరవ్వగా.. కరణ్ అనన్య పాండేని ఉద్దేశించి నువ్వింకా వర్జిన్ అని మీ అమ్మ అనుకుంటుందా? అంటూ అసభ్యకరంగా మాట్లాడారు.

ఇక నేడు టైగర్ ష్రాఫ్ తో కలిసి కృతి సనన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యింది. ఇక ఇందులో భాగంగానే కరణ్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది కృతి సనన్.. దీంతో కరణ్ కూడా ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో కూడా నెట్టింట వైరల్ గా మారుతుంది.. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఎప్పటిలాగే లవ్ , డేటింగ్ ప్రశ్నలు అడిగాడు కరణ్ అయితే కృతి సనన్ నువ్వు ఎప్పుడైనా ఆడిషన్ కి వెళ్ళావా? నిన్ను ఎవరైనా రిజెక్ట్ చేశారా ? అని అడిగాడు. దీనికి కృతి సనన్ సమాధానం ఇస్తూ.. నన్ను రిజెక్ట్ చేసింది మీరే..

నేను మొదట ఆడిషన్ కు వెళ్లిన సినిమా స్టూడెంట్ అఫ్ ది ఇయర్ – 1.. ఈ సినిమా డైరెక్టర్ మీరే.. నాకు అవకాశం ఇవ్వలేదు అని తెలిపింది. ఇక దీంతో కరణ్ ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయ్యాడు .ఒక రకంగా ఇన్ డైరెక్ట్ గా.. మీరే నాకు అవకాశం ఇవ్వలేదు.. ఇప్పుడేమో పిలిచి ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నారు అని కృతి సనన్ అనడంతో కరణ్ కి కౌంటర్ పడిందని నెటిజల్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version