సీఎం జగన్‌ పై దాడి..రంగంలోకి ఎన్నికల సంఘం

-

CM Jagan: సీఎం జగన్‌ పై దాడి నేపథ్యంలో..రంగంలోకి ఎన్నికల సంఘం దిగింది. సీఎం జగన్‌ పై దాడిని సీరియస్సుగా తీసుకుంది ఈసీ. ఈ మేరకు బెజవాడ సీపీ కాంతి రాణా తాతాను నివేదిక కోరింది సీఈఓ ఎంకే మీనా. తాతా నుంచి ప్రాథమిక సమాచారం తీసుకుంది ఏపీ సీఈఓ. ఏపీలో జీరో వయెలెన్స్ ఎన్నికలే టార్గెట్టుగా పెట్టుకుంది ఈసీ.

Attack on CM Jagan Sensational decision of police department

ఏకంగా సీఎం జగన్‌ పైనే దాడి జరగడంతో ఈసీ సీరియస్ అయింది. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీపీ కాంతి రాణా తాతా. అటు జగన్ పై రాళ్ళ దాడి ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు…. సీఎం జగన్, వెల్లంపల్లి ఇద్దరికీ తగిలిన రాయి ఒకటేనా లేక వెర్వేరా అని విషయంపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే విచారణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన సీపీ రానా… జగన్ పై దాడి కేసును నిరంతరం పరివేక్షిస్తున్నారు డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version