నకిలీ వజ్రాలతో ఘరానా మోసానికి యత్నం.. ఇద్దరి అరెస్ట్

-

చిత్తూరు: పలమనేరులో నకిలీ వజ్రాలతో ఘరానా మోసానికి యత్నించారు ఇద్దరు వ్యక్తులు. బాధితుడి ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసి 12 నకిలీ వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. వజ్రాలుగా చెప్పి రంగురాళ్లతో పలమనేరు మండలం ఎం.కోటూరు గ్రామానికి చెందిన కన్నయ్య గౌడ్ ని మోసం చేసేందుకు యత్నించారు చంద్రకుమార్ అలియాస్ డేవిడ్, శ్రీనివాసులు.

20 లక్షల ఖరీదైన 12 నకిలీ వజ్రాలను 10 లక్షలకే విక్రయిస్తామని కన్నయ్య గౌడ్ ను నమ్మించారు. వీటి నాణ్యత పరిశీలించుకుని రావాలని 12 నకిలీ వజ్రాలను కన్నయ్య గౌడ్ కి ఇచ్చారు చంద్రకుమార్, శ్రీనివాసులు. అదే సమయంలో కన్నయ్య గౌడ్ వద్ద నుంచి నకిలీ వజ్రాలను దారి కాచి కొట్టేశాడు మరో వ్యక్తి. అనంతరం విలువైన వజ్రాలు పోగొట్టినందుకు మాకు డబ్బులు చెల్లించాలంటూ కన్నయ్య గౌడ్ ని బెదిరించారు చంద్రకుమార్, శ్రీనివాసులు.

తనకి ఏం చేయాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు కన్నయ్య గౌడ్. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని, కన్నయ్య గౌడ్ ను మోసం చేసేందుకు ప్రయత్నించారని గుర్తించారు పలమనేరు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు నిందితులు చంద్రకుమార్, శ్రీనివాసులు. వజ్రాలుగా చెప్పే 12 రంగు రాళ్లును స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version