పెన్షన్ల పంపిణీ పై అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

పెన్షన్ల పంపిణీ పై కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ల పంపిణీలో జరిగిన ఘోరానికి చంద్రబాబునాయుడే కారణమన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అవ్వదాతలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబునాయుడు తప్పుడు పని వల్ల నేడు అవ్వ , తాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..ఎండల కు తట్టుకోలేక చాలామంది వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని మండిపడ్డారు.

మరికొందరు మృత్యువాత పడుతున్నారని… వాలంటరీ వ్యవస్థను సస్పెన్షన్ చేసినారు కాబట్టి డబ్బులను బ్యాంకుల్లో జమ చేశారని తెలిపారు. బ్యాంకుల వద్దకు వెళ్లి అవ్వ తాతలు వేచి ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..చంద్రబాబు నాయుడు వల్లే ఈరోజు అవ్వ తాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

గత రెండు నెలలుగా పెన్షన్ ఇబ్బందులు కలగడానికి కారకుడు చంద్రబాబు నాయుడు అని ఆగ్రహించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారు…చంద్రబాబు నాయుడు అధికారం లోకి వస్తే తిరిగి తమ ఒక పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారని అవ్వ తాతలు పసిగట్టారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version