వైఎస్ వివేకా హత్య కేసుపై అవినాష్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు !

-

వైఎస్ వివేకా హత్య కేసుపై అవినాష్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ… నాపైన అనవసరంగా పెదనాన్న వైఎస్ వివేకా హత్య కేసు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను మా నాన్నను చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు.

Avinash Reddy’s controversial comments on the case of YS Viveka

జైల్లో మా నాన్నను నేను కలిసినప్పుడల్లా నాకు తెలిసి జీవితంలో ఎవరికి ఏ పాపం చేయలేదు దేవుడు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు… ఎందుకు ఇలా జరుగుతోంది అని నాతో అంటూ బాధపడేవాడని వివరించారు. దేవుని దయ మీ అందరి చల్లని దీవెనలతో ఇటీవల నాన్నకు బెయిల్ వచ్చింది….మా కుటుంబంలో ఇద్దరు అక్కగారు చంద్రబాబు ట్రాప్ లో పడిపోయారని ఫైర్‌ అయ్యారు.

వాళ్ల డైరెక్షన్లో వీళ్లు నడుచుకుంటున్నారన్నారు. దయచేసి ప్రజలు చంద్రబాబు ట్రాప్ లో పడకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను….తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ వచ్చేలా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version