బాచుపల్లి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరుణంలోనే…హరిజాన్ కన్స్ట్రక్షన్ ఎండి అరవింద్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేశారు బాచుపల్లి పోలీసులు. నిర్మాణం నాణ్యత ప్రమాణాలు కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చారు. గాంధీ హాస్పిటల్ లో పోస్టు మార్టం అనంతరం మృత దేహాలు స్వరాష్ట్రాలకు తరలించనున్నారు పోలీసులు.
కాగా, బాచుపల్లి లో దారుణం కన్స్ట్రక్షన్ గోడ కూలీ ఏడుగురు కార్మికులు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్ లో సెంట్రింగ్ పని కార్మికుల షెడ్ పై కూలింది రిటన్నింగ్ వాల్. ఈ ఘటన లో 7 గురూ కార్మికులు మృతి చెందారు. మృత్యువాత పడిన కార్మికులు ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.