సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపాత్రుడు కి నోటీసులు..!

-

గన్నవరం యువగళం సభ లో సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని అయ్యన్నపాత్రుడు కి నోటీసులు జారీ చేసింది హనుమాన్ జంక్షన్ సర్కిల్ కార్యాలయం. పోలీసులకు వివరణ ఇచ్చేందుకు హనుమాన్ జుంక్షన్ కార్యాలయానికి చేరుకున్నారు అయ్యన్నపాత్రుడు. ఈ సందర్భంగా అయన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. ఎయిర్ ఫోర్ట్ లో నన్ను అరెస్ట్ చేసి నాకు నోటీసులు ఇవ్వకుండా 50 కిలోమీటర్లు తిప్పి అప్పుడు నాకు నోటీసులు ఇచ్చారు. ప్రజల తాలూకు వచ్చిన ఆలోచనలను నేను స్టేజి మీద అస్సలు మాట్లాడను.

దాదాపు సంవత్సరానికి 7లక్షల ఉద్యోగాలు ఇస్తాను అన్న జగన్ ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడొ చెప్పాలి అని డిమాండ్ చేశారు అయ్యన్న పాత్రుడు. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చెయ్యక పోగా మద్యం మీద అప్పుతెచ్చాడని పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై సీఎం జగన్ అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version