రాజమండ్రి సెంట్రల్ జైలులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న చంద్రబాబు పై అన్ని రంగాల వారు స్పందిస్తున్నారు. తాజాగా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో విశాల్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కొన్ని కామెంట్లు చేశారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం హీరో విశాల్ మాట్లాడుతూ, టీడీపీ అధినేత ప్రజల మన్ననలను అందుకున్న నేత చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఒక సామాన్యుడిగా ఈ విషయం గురించి తెలిసిన వెంటనే చాలా బాధపడ్డానంటూ విశాల్ చెప్పారు. చంద్రబాబు గొప్ప నాయకుడు, ఈయన లాంటి వారికే ఇలాంటి దుస్థితి వస్తే ఇక మా లాంటి సామ్సన్యుల పరిస్థితి ఏమిటి అంటూ ఆవేదనతో ప్రశ్నించాడు విశాల్. ఎవరు ఎన్ని కుట్రలు చేసి ఆయన్ను లోపల ఉంచాలని చూసినా చివరకు న్యాయమే గెలిచి ఆయన బయటకు వస్తారని నమ్మకాన్ని విశాల్ వ్యక్తం చేశారు.
ఇక గతంలో విశాల్ ఆంధ్రప్రదేశ్ లోని ఒక నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేయనున్నారంటూ వార్తలు వినబడిన సంగతి తెలిసిందే.