బాబు, లోకేష్, పవన్ బూతులు తిట్టలేదా..? : అంబటి రాంబాబు

-

గతంలో చంద్రబాబు నాయుడు, నాారా లోకేష్, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టలేదా అని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలపై అరెస్ట్ చేయాల్సి వస్తే రాజకీయాల్లో ఉన్న వారందరినీ చేయాల్సి వస్తుందని చెప్పారు. సినీ ప్రముఖులను అరెస్ట్ చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకే ఆర్జీవీ, పోసాని పై కేసులు పెట్టారు. ఇంకా చాలా మందిని అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోంది. కానీ అక్రమ కేసులకు మేము భయపడమని తెలిపారు అంబటి రాంబాబు.

ముఖ్యంగా సినీ నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ లో అక్రమంగా అరెస్ట్ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు కుతంత్రంలో పర్వమే అన్నారు. ఏనాడో చేసిన సాధారణ వ్యాఖ్యల ఆధారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందని తెలిపారు. గతంలో కుట్ర పూరితంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఆయన పై టీడీపీ, జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేసాయని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version