ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా..? లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ మార్పులు చేయండి!

-

జీవితంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఎంతో కష్టపడతారు. ముఖ్యంగా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని ప్రతిరోజు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే జీవితంలో ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే వాస్తు శాస్త్రంలో చెప్పిన పరిష్కారాలను తప్పకుండా పాటించాల్సిందే. ఎందుకంటే చాలా శాతం ఎంతో కష్టపడినా సరే సరైన ఫలితాలు పొందలేరు. ముఖ్యంగా అటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పినటువంటి మార్పులను తప్పకుండా చేసుకోవాలి. ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలి అని అనుకుంటున్నారో మీ ఇంట్లో ఈ వస్తువులని ఉంచుకోవడం ఎంతో అవసరమని గుర్తుంచుకోండి.

ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలంటే గోమతి చక్రాన్ని ఇంట్లో తప్పకుండా ఉంచాలి. దీనివలన ధనంతో పాటుగా ఆనందం మరియు ప్రశాంతతను కూడా పొందవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం 11 గోమతి చక్రాలను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఇంట్లో ఉంచడం వలన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అంతేకాకుండా శనివారం నాడు స్టీలు పాత్ర తీసుకుని దానిలో పచ్చిపాలు, చక్కెర, నెయ్యి కలిపి రావి చెట్టుకు నైవేద్యం పెట్టాలి. ఇలా చేయడం వలన ధన ప్రాప్తిని పొందువచ్చు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటుగా పప్పు దినుసులు, బెల్లం ను కూడా ఉపయోగించి నైవేద్యం పెట్టవచ్చు.

ఎప్పుడైనా ఇంటి ప్రధాన ద్వారం నుండే ఎలాంటి శక్తులు అయినా ప్రవేశిస్తాయి. కనుక మంచి శక్తులను తీసుకొచ్చే చిహ్నాలను ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి. కలశం, చేప, కమలం, శంఖం వంటి మంచి చిహ్నాలను పెట్టాలి. అదేవిధంగా స్వస్తిక, ఓం వంటి మొదలైన చిహ్నాలను ప్రధాన ద్వారం పైన లేక రెండు వైపులా పెట్టాలి. ఇలా చేయడం వలన ఎంతో మంచి ఫలితాలను పొందుతారు. ఎప్పుడైతే మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో తామర విత్తనాల దండలను ఇంట్లో పెట్టండి. ఇలా చేయడం వలన ధనాన్ని పొందే మార్గం తెరుచుకుంటుంది. కనుక ఇటువంటి వస్తువులను తప్పకుండా ఇంట్లో ఉంచి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version