ఏపీలో మరో క్యాన్సర్ ఆసుపత్రి – బాలయ్య ప్రకటన

-

ఏపీలో మరో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు నందమూరి బాలయ్య. ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు బాలకృష్ణ. బసవతారకం ఆస్పత్రిలో పిడియాట్రిక్ అంకలాజీ యూనిట్‌ని ప్రారంభించారు నందమూరి బాలకృష్ణ. ప్రపంచ చైల్డ్ హుడ్ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి సేవలు రానున్నాయి.

Balakrishna said that a cancer hospital will be established in Tullur, AP

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు.  బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిని మరింత విస్తరించనున్నామని ఆస్పత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ తెలిపారు.  విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news