మైత్రి మూవీస్‌లో బాలినేని భారీ పెట్టుబడులు..వాస్తవమెంత?

-

మైత్రి మూవీస్‌లో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భారీ పెట్టుబడులు పెట్టాడని వస్తున్న వార్తలపై…స్వయంగా ఆయనే స్పందించారు. మైత్రీ మూవీస్ లో నేను పెట్టుబడులు పెట్టాననటం అవాస్తవం అని.. అందరినీ ప్రశ్నిస్తా అంటున్న పవన్ కళ్యాణ్ ను ఒక్కటే ప్రశ్నిస్తున్నానని వెల్లడించారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.


పవన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత లందరినీ అడిగి తెలుసుకోండి..మైత్రీ మూవీస్ లో నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ పెట్టుబడులు పెట్టామని నిరూపిస్తే మా ఆస్తులు మొత్తం రాసిచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసి రారు. వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సహకరిస్తే మైత్రీ మూవీస్ లో పెట్టుబడులు పెట్టినట్లా.. వీరసింహారెడ్డి సినిమాకే కాదు ఏ సినిమాకు అయినా అవసరం అయితే సహకరిస్తానని పేర్కొన్నారు.

వైజాగ్ లో మా కుటుంబ సభ్యులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేయటం సరికాదు.. ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. మైత్రీ మూవీస్ లో కానీ, వైజాగ్ భూకబ్జా సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్దం అన్నారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మైత్రీ మూవీస్ లో పెట్టుబడులు ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే పెడుతున్నారో అందరికీ తెలుసు..ప్రజల్లో ఆదరణ ఉందని బురద చల్లాలని చూస్తున్నారు.. ఈ విషయంలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సంబంధం లేకుండా అభియోగాలు చేస్తున్నారు.. నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version