ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలు సామాజిక వర్గీయులను BC-D లుగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలను అందిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఈ సామాజిక వర్గానికి చెందిన పలువురు మంత్రి సవితను కలిసి దీనిపైన వినతి పత్రం ఇచ్చారు.

తమ వర్గీయులను BC-D కాస్ట్ సర్టిఫికెట్ అందించాలని GO ఉన్నా, కేవలం VZM, SKLM, కృష్ణ, విశాఖ జిల్లాల్లోనే ఇది అమలు అవుతుందని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు.