ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్…విజయవాడ-మచిలీపట్నం హైవేకు మంచిరోజులు వచ్చాయి. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న దీన్ని ఆరు లేన్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. బందరు పోర్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో భవిష్యత్తులో ఈ రహదారిపై భారీగా రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో DPR కోసం టెండర్ ను NHAI ఖరారు చేసింది. డిసెంబర్ లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా, ‘ఫిష్ ఆంధ్ర’ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2వేల అవుట్ లైట్స్ ఏర్పాటు చేసి మత్స్య ఉత్పత్తులను విక్రయిస్తున్న ప్రభుత్వం… మరో అడుగు ముందుకు వేయనుంది. ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఉత్పత్తులను డోర్ డెలివరీ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఫ్రెష్ చేపలు, రొయ్యలు, పీతలతో పాటు రెడీ టు కుక్ విధానంలో మారినేట్ ఉత్పత్తులను కూడా అందించనుంది. ఇందుకోసం స్విగ్గి, జొమాటో వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకోనుంది.