ఏపీ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఈ రెండు ప్రక్రియలకు 55,966 మంది దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం 43,714 మంది ఆన్సర్ షీట్ల రిజల్ట్స్ మాత్రమే విడుదల చేసింది.
మిగిలిన విద్యార్థుల ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. విద్యార్థులు తమ స్కూల్ హెడ్‌మాస్టర్ లాగిన్ నుంచి రిజల్ట్స్ కాపీలను పొందవచ్చు. అటు ఏపీ విద్యార్థులకు శుభవార్త..స్కూళ్లు తెరిచిన రోజే పాఠ్య పుస్తకాల పంపిణీ అందించనున్నారు. స్కూళ్లు తెరిచిన రోజే పాఠ్య పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు 2024-25 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్కు అవసరమైన పుస్తకాలు పంపిణీ చేరుకున్నాయి. జూన్ 12న స్కూళ్ల తెరిచిన రోజు నుంచే బుక్స్ పంపిణీ జరుగనుంది.