ఏపీలోని ఉపాధ్యాయులకు బిగ్ షాక్ తగిలింది. సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ నిబంధనలు అమలు చేయనుంది జగన్ మోహన్ రెడ్డి. 1 నుంచి తప్పనిసరిగా యాప్ లో హాజరు వేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు అంతా ఇదే యాప్ లో హాజరు వేయాలని, ఆగస్టు 31 లోపు ఉపాధ్యాయులంతా యాప్ లో నమోదు చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వం డివైజ్ లు ఇస్తే తప్పకుండా హాజరు నమోదు చేస్తామంటున్నారు.
ఉపాధ్యాయ సంఘాలు ఫేస్ రికగ్నేషన్ హాజరులో చాలా సమస్యలు ఉన్నాయని, వీటిని పూర్తిస్థాయిలో పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు. ఇచ్చేవరకు యాప్ లో హాజరును స్వచ్ఛందం చేయాలంటున్నారు. సమస్యల్ని పరిష్కరించకుండా మళ్ళీ యాప్ లో అటెండెన్స్ నిబంధన సరి కాదంటున్నారు.