వైసీపీ పార్టీకి వరుస షాక్ లు తలూగుతూనే ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ పార్టీకి వరుస షాక్ లు తలూగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో బిగ్ షాక్ కూడా తగిలింది. కడప కార్పొరేషన్ లో ఏడు మంది కార్పొరేటర్ లు జంప్ కానున్నారు. రేపు అంటే సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు కార్పొరేటర్లు. ఈ క్రమంలో వైసీపీ కార్పొరేటర్లతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చర్చలు జరిపారు.
కడప పట్టణంలోని అలంకానపల్లెలో నిన్న సాయంత్రం మున్సిపల్ కార్పొరేటర్లతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసారు. కానీ అవినాష్ రెడ్డి సమావేశానికి అసంతృప్తి కార్పొరేటర్లు హాజరు కాలేదు. గత రెండు నెలల క్రితం వైసీపీని వీడి టీడీపీలో చేరారు 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ. కార్పొరేషన్ లో కుర్చీల గోల తర్వాత అసంతృప్తి కార్పొరేటర్ల పై దృష్టి సారించింది టీడీపీ. అయితే ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీకి ఇద్దరు కార్పొరేటర్ లు మాత్రమే ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే రేపు కడప కార్పొరేషన్ లో ఏడు మంది కార్పొరేటర్ లు జంప్ కానున్నారు.