నేను ఎక్కడ ఉన్నా.. ఆ శాఖకి పూర్తిగా న్యాయం చేస్తా : మంత్రి తుమ్మల

-

పసుపు బోర్డుపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. నువ్వెక్కడ పోయావని అడిగినా ప్రశ్నకు.. తాను కేంద్రానికి రాసిన లేఖలు విడుదల చేసారు మంత్రి తుమ్మల. పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు ప్రధానికి అభినందనలు చెప్పడం కూడా తప్పేనా.. అభినందనలు చెప్పడం కూడా తప్పే అంటే.. అది మీ రాజకీయ పరిజ్ఞానానికి వదిలేస్తున్న.

పసుపు బోర్డు ఏర్పాటు అర్థరాత్రి ప్రకటించి.. తెల్లారి ప్రారంభించినా మేము తప్పు పట్టట్లేదు. ఫెడరల్ స్ఫూర్తి నీ కూడా పాటించలేదు మీరు. కానీ మీరు నన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు కాబట్టి.. మీకు కొన్ని విషయాలు చెప్తా. నేను వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక… మూడు సార్లు కేంద్రానికి ఉత్తరాలు రాశా. రెండు సార్లు మా కమిషనర్ తో లేఖ రాయించా… మా సిఎం తో కూడా కేంద్రాన్ని అడిగించా. నేను ఎక్కడ ఉన్నా.. ఆ శాఖ కి పూర్తిగా న్యాయం చేస్తా. కావాలంటే మీ బీజేపీ పెద్దలను అడుగు నా పనితీరు గురించి. కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ లను అడిగి తెలుసుకో. నిజామాబాద్ లో ఉన్న చాలా ప్రాజెక్టుల వద్ద నా పేరుతో శిలాఫలకం ఉంటుంది అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version