గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసారు మియాపూర్ పోలీసులు. నిందితుని వద్ద నుండి 6.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడు ఇంద్ర కుమార్ ను మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో పిల్లర్ 603 దగ్గర రాత్రి మాదాపూర్ sot team, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు నాగర్ కర్నూల్ జిల్లా ఇంద్రకుల గ్రామానికి చెందిన ఇంద్ర కుమార్ ను అనుమానించి అదుపులోకి తీసుకున్నారు sot పోలీస్.
అయితే నిందితుడికి అరకులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అరకు నుండి సంక్రాంతి పండగకు సొంతగ్రామానకి వస్తు గంజాయి తీసుక వచ్చి స్థానికంగా విక్రయించేందుకు పథకం పన్నాడు. అతని దగ్గర 6.5 ఎండు గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గతంలో alwal పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులో నిందితుడుగా కూడా ఉన్నాడు ఇంద్ర కుమార్.