BREAKING : ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంటి ముట్టడి !

-

BREAKING : ఇవ్వాళ మహేశ్వర్ రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నిన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడి కోసం బీజేపి నాయకులు వెళ్లిన నేపధ్యంలో ఇవ్వాళ బీజేపి నేత మహేశ్వర్ రెడ్డి ఇంటి ముట్టడిస్తామని బీఆర్ఎస్ ప్రకటన చేసింది. కాగా, నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే.. నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్ష భగ్నం అయింది.

నిర్మల్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిన్న అర్థరాత్రి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్ష భగ్నం చేసి.. ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి నిర్మల్ పర్యటన ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే…హాస్పిటల్ లో సైతం బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారని సమాచారం. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకే తదుపరి కార్యాచరణ ఉంటుందని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version