సుప్రీంకోర్టులో రఘురామకృష్ణ రాజు చుక్కెదురు ?

-

 

సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన ఏ పిటీషన్ ను కోర్టు కొట్టి వేయలేదని రఘురామకృష్ణ రాజు స్పష్టం చేశారు. ఇది జగన్ మోహన్ రెడ్డికి దక్కిన విజయమని సాక్షి దినపత్రికలో రాసుకున్నా ప్రయోజనం శూన్యం అని ఆయన పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారిపై నమోదు చేసిన కేసులను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని, ఆయన బెయిల్ ను రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు గారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టులో ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించే ముకుల్ రోహత్గి గారు, రంజిత్ కుమార్ గారు ఈ కేసులో జగన్ మోహన్ రెడ్డి గారి తరుపున వాదనలను వినిపించారని తెలిపారు.

అలాగే వైకాపా పార్లమెంట్ సభ్యుడు ఎస్. నిరంజన్ రెడ్డి గారు కూడా న్యాయవాద బృంద సభ్యునిగా ఉన్నారని, సీబీఐ తరఫున తుషార్ మెహతా గారు కోర్టుకు హాజరయ్యి సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి హైకోర్టులో కేసులను వేగవంతం చేయాలని చెప్పారని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేసుల విచారణ ఖచ్చితంగా వేగమంతమయ్యే అవకాశాలు ఉన్నాయని, జగన్ మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేయాలని దేశంలోనే ప్రముఖ న్యాయవాదులు అభ్యర్థించినా సుప్రీంకోర్టు తిరస్కరించిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news