సిడ్నీలో తెలుగు ప్రజలతో సమావేశం అయిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి..!

-

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తెలుగు కమ్యూనిటీతో బీజేపీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశమయ్యారు. కామన్ వెల్త్ సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ తెలుగు వారికి సమయం ఇచ్చారు పురంధేశ్వరి. అయితే సమావేశం కోసం వెళ్లిన పురంధేశ్వరికి వారి నుండి అద్భుతమైన స్వాగతం లభించింది. ప్రస్తుతం తాము నివసిస్తున్న దేశాలకు ఆర్థికంగా, రాజకీయంగా సానుకూలంగా సహకరిస్తూ మన దేశం, రాష్ట్రం గర్వపడేలా చేసిన తెలుగు వారు జాతికి గర్వకారణం అని ఆమె పేర్కొంది.

అలాగే జననీ జన్మ భూమిశ్చ స్వర్గ దపి గరియసి అంటూ.. మాతృభూమికి సేవ చేయడం కంటే గొప్ప స్వర్గం లేదు. అందుకే వారు నివసించే భూమికి తమ వంతు సహకారం అందించినప్పటికీ, వారు తమ మాతృభూమికి సేవ చేయడం మర్చిపోకూడదని సందర్భోచితంగా పురంధేశ్వరి వారితో మాట్లాడారు. అలాగే ఆస్ట్రేలియాలో తెలుగు వారితో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు బీజేపీ ఎంపీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version