వైసిపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి పొలిటి బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల గోప్యతకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. వాలంటీర్ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని.. ప్రజల డేటాను విదేశాలకు అమ్ముకోవాలనేదే జగన్ కుట్ర అని ఆరోపించారు. ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నారని.. జగన్ ప్రభుత్వంలో ప్రజల అకౌంట్లో డబ్బులకు కూడా గ్యారెంటీ లేవని దుయ్యబట్టారు.
ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో అమలు చేస్తున్న ఈ విధానం వల్ల ప్రజల ఆస్తులు, ధన, మాన ప్రాణాలకు రక్షణ లేదన్నారు. 5.5 కోట్ల మందికి చెందిన డేటా దుర్వినియోగం వల్ల వైసీపీ బ్యాచ్ ఇప్పటికే రూ. 50 వేల కోట్ల పేదల భూములు కాజేసిందని ఆరోపించారు. జగన్ అక్రమాలను ప్రశ్నిస్తే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.