వీలైనంత త్వరగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, ప్లస్2 ఖాళీల భర్తీ తరువాత డీఎస్సీ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు గతంలో లీకేజీ ఆరోపణలు వచ్చిన టీచర్లను తహసిల్దార్ కార్యాలయాల్లో ఉంచాలన్న సర్క్యులర్ వెనక్కి తీసుకున్నామని చెప్పారు.
టీచర్లపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని స్పష్టం చేశారు. అలాగే..కేబినెట్ విస్తరణపై బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం, విచక్షణాధికారం అన్నారు. దాని మీద మంత్రులం మాట్లాడటం కరెక్ట్ కాదని… ఎమ్మెల్సీ ఫలితాలకు మంత్రి వర్గ మార్పుకు సంబంధం ఏముంటుంది? అని తెలిపారు. విశాఖ నుంచి రేపటి నుంచే పాలనా ప్రారంభం కావాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు.