తిరుమలలో మరోసారి నకీలి టిక్కెట్ల కలకలం రేపాయి. తిరుమలలో నకీలి టిక్కెట్లతో భక్తులను మోసం చేశారు దళారులు. హైదరాబాద్ కి చెందిన ఉపేందర్ కి డోనార్స్ ప్రివిలేజ్ పేరుతో నకీలి టికెట్స్ ఇప్పించారు దళారులు అనిల్, చిరంజీవి. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో డోనార్స్ ప్రివిలేజ్ పేరుతో నకీలి టికెట్స్ ను తనిఖీలో గుర్తించింది టీటీడీ పాలక మండలి సిబ్బంది.
ముగ్గురికి 13 వేల రూపాయలు వసూలు చేసిన అనిల్,చిరంజీవి.. భక్తులకు నకిలీ టికెట్లు ఇచ్చారు. అసలు రంగు బయట పడటంతో… ఉపేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు…. అనిల్,చిరంజీవిలను గాలిస్తున్నారు. ఇక ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో… టీటీడీ అలర్ట్ అయింది.
తిరుమలలో మరోసారి కలకలం
నకిలీ శ్రీవారి దర్శనం టికెట్లు పట్టుకున్న విజిలెన్స్ అధికారులు
దళారుల దగ్గర టికెట్లు కొన్నట్లు గుర్తింపు
భక్తుల ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు#TTD #Scam #FakeTickets #Tirumala #contractEmlpoyee@TTDevasthanams @ncbn @PawanKalyan pic.twitter.com/zSfVTbtr3G
— Pulse News (@PulseNewsTelugu) January 31, 2025