Buchepalli Siva Prasad: జనసేన నేత బాలినేనిపై దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. బాలినేని జనసేనలోకి పోవటం ప్రకాశం జిల్లాలో వైసీపీకి పట్టిన పీడ పోయిందని చురకలు అంటించారు. బాలినేని పెద్ద కమల్ హసన్ .. బాలినేనితో సినిమా తీయాలని సెటైర్లు పేల్చారు. బాలినేని అనే వ్యక్తి అవకాశవాది.. తన అవకాశం కొసం దేనికైనా దిగజారతాడన్నారు.
వైసీపీలోని మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల వద్ద దొచుకున్నావు అంటూ నిప్పులు చెరిగారు. జడ్పిటిసిలు నీలా పార్టీలు మారే పరిస్థితులు ఎవరు లేరన్నారు. ప్రకాశం జిల్లా జడ్పీని బాలినేని ఏమి చేయలేడని తెలిపారు.