ఆ కోటరీ వదలదు, కోట కూడా మిగలదు – విజయసాయిరెడ్డి వార్నింగ్

-

ఆ కోటరీ వదలదు, కోట కూడా మిగలదు అంటూ సంచలన ట్వీట్ పెట్టారు విజయసాయిరెడ్డి.  పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేదని పేర్కొన్నారు.

vijayasai reddy, jagan,

దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదని తెలిపారు సాయిరెడ్డి. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగ లదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే! అంటూ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ ట్వీట్‌ ఎవరినీ ఉద్దేశించి.. పెట్టాడు అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version