భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది ఓ భార్య. అయితే.. ఈ సంఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా పొలాసలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి భార్య జమున, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి ఉంటున్నారు కరుణాకర్. అయితే… కొద్ది రోజుల క్రితం మూడో వివాహం చేసుకున్నారు కరుణాకర్.
ఈ తరుణంలోనే… తరచూ భార్య జమున, పిల్లలతో కమలాకర్ కు ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భర్త కరుణాకర్ పై కత్తితో దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య జమున. అయితే.. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరుణాకర్ మృతి చందాడు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.