విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి టికెట్‌ ఇవ్వండి – బుద్దా వెంకన్న

-

విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి టికెట్‌ ఇవ్వండని చంద్రబాబును కోరారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. చంద్రబాబుకు రక్తభిషేకం చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. తన రక్తం తీసి చంద్రబాబు చిత్ర పటానికి కాళ్లు కడిగారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. సీబీఎన్ జిందాబాద్ అంటూ రక్తంతో గోడ మీద రక్తంతో రాసిన బుద్దా….చంద్రబాబుపై నాకున్న స్వామిభక్తిని చాటుకున్నానన్నారు. చంద్రబాబు హృదయాన్ని కదిలించాలనే నా ప్రయత్నం అని.. చంద్రబాబు నాకు దేవుడని వివరించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.

budda venkanna on tdp ticket

చంద్రబాబు నాకు టిక్కెట్ ఇవ్వకున్నా నేను వ్యతిరేకించను….పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పటి నుంచి నేను కష్టపడ్డానని వెల్లడించారు. కేశినేని అనే వెధవ నా దరిద్రానికి పార్టీలోకి వచ్చాడని ఫైర్‌ అయ్యారు. నన్ను తప్పించాలని కేశినేని నాని తెగ ప్రయత్నించాడని… అర్బన్ పార్టీ అధ్యక్షునిగా నేను ఆరేళ్లు చేశానన్నారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. 2019లో ప్రభుత్వం కోల్పోయింది.. ఆ తర్వాత కూడా కేశినేని నాని నన్నే టార్గెట్ చేశాడని మండిపడ్డారు.కేశినేని నాని ఎన్ని చెప్పినా చంద్రబాబు నన్ను ప్రొత్సహిస్తూనే ఉన్నారు….175 స్థానాల్లో పశ్చిమ సీటు ఒక్కటే పక్కన పెడుతున్నారన్నారు.174 స్థానాల్లోనే ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతున్నారు…ఇది నాకు బాధ కలిగించిందని తెలిపారు. విజయవాడ వెస్ట్, అనకాపల్లి లోక్ సభ స్థానాల్లో ఏదోక చోటు నుంచి నాకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version