పశ్చిమ గోదావరి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది…ఏకంగా 25 మంది ప్రయాణికులు ఈ బస్సులో ఉన్నప్పుడు ప్రమాదం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ముదునూరు వద్ద కాలువలోకి పల్లె వెలుగు బస్సు..దూసుకువెల్లింది. ఇక ఈ ప్రమాదం పై డ్రైవర్ దుర్గాసాయి స్పందించారు.
స్టీరింగ్ వదిలేయడంతో ప్రమాదం జరిగిందని తెలిపిన డ్రైవర్ దుర్గాసాయి…ఒక్కసారిగా ఇలా జరిగిందని పేర్కొన్నాడు. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారని.. లేడీ కండక్టర్‌తో పాటు ఓ ప్రయాణికుడికి గాయాలు అయ్యాయని డ్రైవర్ దుర్గాసాయి తెలిపారు. ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ఈ సంఘటన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.