దిశ యాప్ అంటే..మగాళ్లు భయపడేవారు – వైసీపీ ఎమ్మెల్యే

-

దిశ యాప్ అంటే..మగాళ్లు భయపడేవారని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి. కర్నూలులోని ఆలూరులో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ…సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మహిళలకు రక్షణ లేదని ఆగ్రహించారు. రాష్ర్టంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందన్నారు. రోజుకో చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని నిప్పులు చెరిగారు.

Busine Virupakshi

మహిళ హోమ్ మంత్రి కళ్ళు మూసుకొని కూర్చున్నారని ఆగ్రహించారు. జగన్ మహిళలకు రక్షణ గా దిశ యాప్ తెచ్చాడన్నారు. దిశ యాప్ అంటే బయపడేవారని తెలిపారు. అలాంటి దిశ పోలీసుస్టేషన్ తీసేయడంతో భయం లేకుండా పోయిందన్నారు. మహిళల రక్షణ నేను వున్నా అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ… అంటూ నిలదీశారు. మహిళల పై అత్యాచారాలు జరుగుతున్నా ఏమి మాట్లాడులేకపోతున్నాడని చెడుగుడు ఆడారు బుసినే విరుపాక్షి.

Read more RELATED
Recommended to you

Exit mobile version